భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి


భక్తియుతంగా  ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి

 విశాఖ అతిమేత్రాసనం  ఎర్ర సామంత గిరిజన విచారణ లో శనివారం నాడు  ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి దేవునికి మహిమ కరముగా జరిగింది. వందలాది భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందారు. 

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , ఎర్ర సామంత వలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తియుతంగా జరిగింది. ఉదయం 10  గంటల నుండి సాయంత్రం 3 గంటలవరకు ఈ ఉపవాస ప్రార్థన కూటమి  జరిగింది.   

ఫాదర్ ప్రభాకర్ గారు  ఈ ఉపవాస ప్రార్థన లో పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు . ఫాదర్  సైమన్ , ఫాదర్ రాయప్ప , ఫాదర్ మరియాదాస్ గార్లు విశ్వాసులకు పాప సంకీర్తలను అందించి, ప్రజలకొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. 

గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ప్రజలను ఆధ్యాతికంగా ముందుకు నడిపిస్తూ ప్రతి నెల రెండవ శనివారం ఈ ప్రార్థన కూటమిని నిర్వహిస్తున్నారు.  ప్రార్థనల అనంతరం ప్రజలందరికి ప్రేమ విందుని గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  ఏర్పాటు చేసారు. 

*It's purely Telugu content, Please turn off Translation
Please visit our website: www.rvasia.org
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer