అస్సాంలో క్రైస్తవ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మళ్లీ బెదిరింపు పోస్టర్లు
అస్సాంలో క్రైస్తవ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మళ్లీ బెదిరింపు పోస్టర్లు
ఈశాన్య అస్సాం రాష్ట్రంలో క్రైస్తవ పాఠశాలల నుండి మతపరమైన చిహ్నాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిసాయి. ఇది చివరి హెచ్చరికగా పేర్కొంది.
ఫిబ్రవరి 23న హిందూ సంస్థ అయిన సాన్‌మిలిటో సనాతన్ సమాజ్ విడుదల చేసిన పోస్టర్, రాష్ట్ర వ్యాపార రాజధాని గౌహతి మరియు ఇతర రెండు ప్రధాన నగరాలు, దిబ్రూఘర్ మరియు జోర్హాట్‌లలోని క్రిస్టియన్ల పాఠశాలల ప్రాంగణంలో విగ్రహాలు మరియు శిలువలను తొలగించాలని అల్టిమేటం ఇచ్చింది.
గౌహతిలో డాన్ బోస్కో స్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్ గోడలపై పోస్టర్లు వెలిశాయి. పాఠశాలలను మతపరమైన సంస్థగా ఉపయోగించడం మానేయడానికి ఇది చివరి హెచ్చరిక. ప్రభు ఏసు క్రీస్తు, మదర్ మేరీ, తదితరులను పాఠశాల ఆవరణల నుంచి తొలగించండి’’ అని రాష్ట్ర అధికార భాష అయిన అస్సామీ భాషలో తాజా పోస్టర్ హెచ్చరించింది. బార్‌పేట, శివసాగర్ పట్టణాల్లోనూ పోస్టర్లు వెలిశాయి.
"ఇది వేరొక పేరుతో సంస్థ పేరుతో దీనిని విడుదల చేసారుఅని, కానీ అదే డిమాండ్ చేస్తున్నారు అని గౌహతి ఆర్చ్ బిషప్ మహా పూజ్య జాన్ మూలచిరా గారు ఫిబ్రవరి 26న UCA న్యూస్‌తో అన్నారు.
గతంలో ఫిబ్రవరి 18న కుటుంబ సురక్ష పరిషత్ (కుటుంబ రక్షణ మండలి) అనే హిందూ సంస్థ పేరుతో ఈ పోస్టర్లను వెలిసాయి.
గిరిజనులు మరియు దళితులు లేదా పూర్వపు అంటరానివారు నివసించే అస్సాంలోని మారుమూల ప్రాంతాల్లో అనేక దశాబ్దాలుగా క్రైస్తవులు విద్యను అందించడంలో ముందున్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer