మతాంతర సంభాషణ ప్రపంచ మెరుగుదలకు మార్గమన్న XIV లియో పోప్ 

నూతన జగద్గురువుల పట్టాభిషేక దివ్యబలి పూజలో పాల్గొన్న క్రైస్తవ మరియు క్రైస్తవేతర ప్రతినిధుల కొరకు 14వ లియో పోప్ సోమవారం ప్రత్యేక అధితుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పోప్ ఫ్రాన్సిస్ మరియు మునుపటి జగద్గురువుల సార్వత్రిక సోదరభావంపై చూపిన  చొరవను గురించి పోప్ మాట్లాడారు 

క్రైస్తవుల మధ్య ఐక్యత “విశ్వాసం వలనే ” అని చెబుతూ, పోప్ లియో 325 ADలో  నైసియాలో జరిగిన మొదటి క్రైస్తవ ఐక్యత సమావేశ 1,700వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు

రోమ్ పీఠాధిపతిగా క్రైస్తవులందరి పూర్తి మరియు దృశ్యమాన సహవాసాన్ని సాధించడం తన ప్రాధాన్యతలలో ఒకటి అని ఆయన అన్నారు.

క్రైస్తవ సమైక్యతా ప్రయత్నానికి మరియు కతోలిక ధర్మసభ పరిపాలనా విధివిధానాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకుని దానిని ప్రోత్సహించడంలో పోప్ ఫ్రాన్సిస్‌ను అనుసరించడానికి తన నిబద్ధతను ప్రతినిధులకు తెలిపారు.

హైందవ, బౌద్ధ, జైన మరియు ఇతర సంప్రదాయాల ప్రతినిధులను ఉద్దేశించి పోప్ లియో మాట్లాడుతూ, “హింస మరియు సంఘర్షణలతో గాయపడిన ప్రపంచంలో” శాంతికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ క్రైస్తవ సమాజాల మధ్య సమైక్యతను, మతాంతర సంభాషణను మరియు సహకారాన్ని అందిస్తామని పోప్ లియో ముగించారు