మతాంతర సమాలోచన మరియు క్రైస్తవ ఐక్యత పై జాతీయ వర్కషాప్

కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI)  మతాంతర సమాలోచన మరియు క్రైస్తవ ఐక్యతా విభాగం సహకారంతో నేషనల్ బైబిల్ కాటెకెటికల్ అండ్ లిటర్జికల్ సెంటర్ (NBCLC) ఏప్రిల్ 08-09, 2025 న మతాంతర సమాలోచన మరియు క్రైస్తవ ఐక్యత పై జాతీయ వర్కషాప్ ను  నిర్వహించింది.

ఈ  వర్క్‌షాప్ కు ప్రాంతీయ మరియు మేత్రాసన కార్యదర్శులు / డైరెక్టర్లు మరియు క్రైస్తవ సంఘాల జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు.

కతోలిక బోధన మరియు సినడ్ వెలుగులో నవీకరణను అందించడం ఈ వర్క్‌షాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం 

రెండురోజులపాటు జరిగిన ఈ వర్కషాప్ లో  సుమారు 60 మంది పాల్గొన్నారు. మొదటి రోజు మతాంతర సమాలోచన  మరియు రెండవ రోజు క్రైస్తవ ఐక్యతకు సంబంధించిన అంశాలను చర్చించారు.

బెంగళూరు సహాయక పీఠాధిపతి మహా పూజ్య జోసఫ్ సుసైనాథన్ గారు స్వాగత పలుకులతో ప్రారంభించారు. మావెలికర పీఠాధిపతులు మహా పూజ్య జాషువా మార్ ఇగ్నేథియోస్ ప్రారంభ ముఖ్య ఉపన్యాసం అందించారు.

సిబిసిఐ కార్యాలయం జాతీయ కార్యదర్శి గురుశ్రీ. డా.ఆంథోనిరాజ్ తుమ్మా , FABC ఫర్ ఇంటర్రిలిజియస్ అండ్ ఎక్యుమెనికల్ అఫైర్స్ సెక్రటరీ గురుశ్రీ డాక్టర్ రాబిన్ షాయా సీలన్, బెంగళూరులోని అషిర్వాద్ డైలాగ్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ అరుణ్ లూయిస్ SJ, ఐదు వేర్వేరు మత సంప్రదాయాల నుండి ప్రముఖ జ్యూరీ చర్చను సమన్వయించారు.

ధార్మిక విద్యా కేంద్రం (DVK)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫాదర్ జోస్ కిజాక్కెకుట్టు CMI మరియు బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ (UTC)లో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా ఉన్న CSI బిషప్ ఎమెరిటస్ సూర్య ప్రకాష్ క్రైస్తవ మత సంబంధ సమస్యలను పరిష్కరించారు.

సినడాలిటీ మరియు క్రైస్తవ మత సంబంధాలపై ప్యానెల్ చర్చను గురుశ్రీ డాక్టర్ బాప్టిస్ట్ పియస్ SVD (CCBI కమిషన్ ఫర్ ఎక్యుమెనిజం కార్యదర్శి) సమన్వయించారు.

మొదటి రోజు దివ్యబలిపూజకు మహా పూజ్య జాషువా మార్ ఇగ్నేథియోస్, మరియు రెండవ రోజు బెంగళూరు అగ్రపీఠాధిపతి మహా పూజ్య పీటర్ మచాడో ప్రధాన అర్చకులుగా వ్యవహరించారు 

అంతర్మత సమాలోచన సేవ విభాగ ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ  
 కొండవీటి అంతయ్య, గురుశ్రీ  టి జోసెఫ్(వరంగల్ మేత్రాసనం), గురుశ్రీ  బోస్కో (నెల్లూరు మేత్రాసనం) గురుశ్రీ అబ్రహం(శంషాబాద్ మేత్రాసనం),గురుశ్రీ  మాథ్యూ వీ(ఆదిలాబాద్ మేత్రాసనం) మరియు గురుశ్రీ లహస్రాయ్ (కర్నూలు మేత్రాసనం)  ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.