ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న శ్రీకాకుళం మేత్రాసనం

ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న శ్రీకాకుళం మేత్రాసనం 

శ్రీకాకాకుళం మేత్రాసనంలో 11 జనవరి 2026న ఆదివారం నాడు అవసరం లో ఉన్న పేదవారికి బెడ్‌షీట్లు, చీరలు మరియు ఆహారాన్ని పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు పాల్గొని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం  మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు పేద వారికి పేదవారికి బెడ్‌షీట్లు, చీరలను అందించారు.

ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో అవసరంలో ఉన్న పేదవారు పాల్గొన్నారు.సేవ్ అస్ స్టూడియో(Save us Studio) డైరెక్టర్ ఫాదర్ ఆల్ఫోన్స్ గారు ఎప్పటిలాగానే తన సహాయ సహకారాలను అందించారు. విచారణ పెద్దలు ,విశ్వాసులు కూడా పాల్గొన్ని తమ సహాయాన్ని అందించారు. 

శ్రీకాకాకుళం మేత్రాసనంలో పేదలు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్నారు. ప్రతి ఆదివారం బిషప్ హౌస్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

Article and Design By 

M Kranthi Swaroop