టి.సి.బి.సి క్రైస్తవ సమైక్య-అంతర్మత సమాలోచన సేవా విభాగ మేత్రాసన డైరెక్టర్ల సమావేశం
2025, నవంబర్ 3 -4 తేదీలలో విజయవాడ మేత్రాసనంలో టి.సి.బి.సి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతర్మత సమాలోచన సేవా విభాగ మేత్రాసన డైరెక్టర్ల సమావేశం ఘనంగా జరిగింది.
నెల్లూరు పీఠ సహకాపరి మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి తన సందేశాన్ని అందించారు.
విజయవాడ పీఠకాపరి మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తన అనుభవాలను పంచుకున్నారు.
నేటి సమాజంలో క్రైస్తవ ఐక్యత అవసరతను గుర్తించాలని, అంతర్మత సమాలోచనలను ఆచరణలో పెట్టడం మరియు ఇతర విశ్వాసాల ప్రజలతో స్నేహ సంబంధాలు కలిగి జీవించాలని మేత్రాసన డైరెక్టర్లను మహా పూజ్య జోసఫ్ రాజారావు గారు ఆహ్వానించారు.
నైసియా కౌన్సిల్ 1700వ వార్షికోత్సవ ప్రాముఖ్యత మరియు నేటి సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని నెలకొల్పడానికి పనిచేస్తున్న అంతర్మత ఉద్యమమైన ధార్మిక జన మోర్చాతో సహకరించడం అనే రెండు ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించారు.
ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్న క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర కార్యకలాపాలు సమీక్షించబడ్డాయి మరియు తగిన కార్యాచరణ ప్రణాళికకు అంగీకరించబడ్డాయని కార్యదర్శి గురుశ్రీ కొండవీటి అంతయ్య తెలియజేశారు.