ఐక్యరాజ్యసమితి 7వ దేశీయ ప్రజల వేదికకు సందేశాన్ని పంపిన పొప్ ఫ్రాన్సిస్

సోమవారం ఫిబ్రవరి 10 ,ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (IFAD) నిర్వహించిన 7వ దేశీయ ప్రజల వేదికకు పంపిన సందేశంలో "భూమి, నీరు మరియు ఆహారం కేవలం వస్తువులు కావని, అవి జీవితానికి పునాది అని పొప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

ఈ ఫోరమ్ ఫిబ్రవరి 10-11 తేదీలలో రోమ్‌లో "దేశీయ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు: ఆహార భద్రత మరియు సార్వభౌమాధికారానికి మార్గం" అనే నేతృత్వంతో జరిగింది.

స్వదేశీ ప్రజలకు తమ గుర్తింపును కాపాడుకునే హక్కు ఉందని అన్నారు, అయితే బహుళజాతి సంస్థలు మరియు రాష్ట్రాలు వ్యవసాయ భూములను ఆక్రమించుకోవడం వల్ల ఈ హక్కు తీవ్రంగా ముప్పు పొంచి ఉందని పోప్ తన సందేశంలో పేర్కొన్నారు

స్థానిక ప్రజల హక్కులను కాపాడుకోవడం అనేది న్యాయం, అది మానవాళికి స్థిరమైన భవిష్యత్తును హామీ ఇచ్చే మార్గం అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

పూర్వీకుల సంప్రదాయాలు “తీవ్రమైన మరియు సంక్లిష్టమైన సవాళ్లు,అనేక ఉద్రిక్తతలలో నిరీక్షణతో జీవిస్తున్న దేశీయ ప్రజలను పోప్ ప్రశంసించారు 

దేశీయ ప్రజల హక్కులు మరియు సంప్రదాయాలను రక్షించే ప్రయత్నాలు ఫలించాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రార్ధించారు.