కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్న భారతీయ క్రైస్తవులు

కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్న భారతీయ క్రైస్తవులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నగరంలో కతోలిక(Catholic) సంస్థ ఆధ్వర్యంలో నడిచే "నజరేత్ ఆసుపత్రి" సిబ్బంది కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్నారు. కుంభమేళా ఉత్సవానికి వెళుతున్న హిందూ యాత్రికులకు ఉచిత ఆహారాన్ని మరియ వైద్యనీ అందిస్తున్నారు.
యాత్రికులకు సహాయం చేయడానికి తాము సంతోషంగా ఉన్నామని నజరేత్ ఆసుపత్రి డైరెక్టర్ ఫాదర్ - గురుశ్రీ విపిన్ డిసౌజా గారు అన్నారు.
అలహాబాద్ డియోసెసన్ కమిషన్ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ సహకారంతో, ఆసుపత్రి జనవరి 29 మరియు ఫిబ్రవరి 3 తేదీలలో ఆసుపత్రి ప్రాంగణం వెలుపల ఉచిత భోజనాన్ని పంపిణి చేసారు.
"భక్తులు 10-15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచి ఈ ప్రదేశానికి చేరుకుంటున్నందున, వారికి ఉచిత భోజన ఏర్పాట్లు చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని గురుశ్రీ విపిన్ డిసౌజా గారు UCA న్యూస్‌తో అన్నారు.
"అలసిపోయిన యాత్రికుల అవసరాలను గుర్తించి, వారికి టీ, స్నాక్స్ మరియు ఇతర ఆహార పదార్థాలు అందించాలని మేము ప్లాన్ చేసాము. మేము కొంతమందికి ఉచితంగా మందులు ఇచ్చాము మరియు అనారోగ్యం పాలైన నలుగురు హిందూ సన్యాసులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాము " అని ఆయన అన్నారు.
సుమారు 25,000 నుండి 30,000 మంది యాత్రికులు ఆసుపత్రి నుండి వివిధ సేవలను పొందారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కతోలిక సన్యాసినులు(సిస్టర్స్) ఆసుపత్రి సిబ్బంది తో కలసి సేవలందిస్తున్నారు.
నజరేత్ ఆసుపత్రి మాదిరిగానే, కతోలిక సన్యాసినులు(సిస్టర్స్) మరియు సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఇంటర్ కాలేజీ సిబ్బంది జనవరి 28 మరియు జనవరి 30 తేదీలలో భక్తులకు ఆహారం మరియు నీటిని అందించారని కళాశాల అధికారి అర్చిత్ బెనర్జీ అన్నారు.
45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం జనవరి 13న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్) లో గంగా-యమున-సరస్వతి నదుల సంగమం వద్ద ప్రారంభమైంది.
ఈ ఆచార స్నానం తమను పాపాల నుండి విముక్తి చేస్తుందని మరియు ఆధ్యాత్మిక ప్రాయశ్చిత్తాన్ని అందిస్తుందని హిందువులు నమ్ముతారు.
ఈ సంవత్సరం కుంభమేళా దాదాపు 400 మిలియన్ల మంది యాత్రికులను వస్తారని నిర్వాహక కమిటీ అంచనా వేస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం, జనవరి 14న మాత్రమే దాదాపు ఆరు మిలియన్ల మంది నదిలో స్నానం చేశారు.
హిందూ పండుగ సందర్భంగా క్రైస్తవులు ఉదారంగా వ్యవహరించడం వల్ల, క్రైస్తవులు మత మార్పిడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కొంతమంది చాలా కాలంగా చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారని క్రైస్తవ కార్యకర్త మినాక్షి సింగ్ గారు అన్నారు.
"క్రైస్తవులు శాంతి, ప్రేమ మరియు మానవాళికి సేవ చేయడంలో ముందు ఉంటారనే సందేశాన్ని ఇది పంపుతుంది" అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ యూనిటీ ఇన్ కంపాషన్ కార్యదర్శి సింగ్ గారు అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer