కర్నూలులో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల
కర్నూలు మేత్రాసనం డిసెంబర్ 21 ఆదివారం నంద్యాల చెక్ పోస్ట్ లోని బిషప్స్ హౌస్ లో సెమీ క్రిస్మస్ వేడుకల ఘనంగా జరిగాయి.
కర్నూలు మేత్రాసన పీఠకాపరులు మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ తండ్రిగారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకలకు పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డిగారు, నందికొట్కూరు శాసన సభ్యులు శ్రీగిత్తా జయసూర్య గారు, కర్నూలు నగర మేయర్ శ్రీ బీవై రామయ్యగారు తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరితమ్మగారు మాట్లాడుతూ "ప్రేమ, సేవలే శ్వాసగా బ్రతికిన క్రీస్తు ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. తోటివారి తప్పులను మన్నిస్తూ, సాటి వారికి సాయమందిస్తూ జీవితంలో ముందుకు సాగాలి అని అన్నారు.
అనంతరం నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్తాజయసూర్యగారు మట్లాడుతూ " యేసు బైబిల్లో చెప్పిన విలువైన వాక్యాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత సమాజం యేసు అడుగుజాడల్లో నడవాలని అనుసరించాలి. శత్రువును సైతం ప్రేమించగలగాలి అని అన్నారు .
కర్నూలు నగర మేయర్ శ్రీ బీవై రామయ్యగారు మాట్లాడుతూ "క్రైస్తవులు ఈ సమాజానికి అందించిన సేవలు మరువలేనివన్నారు. విద్యా, వైద్య రంగాలలో వందల యేళ్లుగా క్రైస్తవులు అందించిన సేవలను ఈ సమాజం మరువదన్నారు.
ప్రజాప్రతినిధులు, దైవ సేవకులు పరస్పరం సహకరించుకుంటూ నవసమాజాన్ని నిర్మిద్దామని కర్నూలు పీఠకాపరి పిలుపునిచ్చారు. క్రైస్తవులు ఉన్నది ప్రేమను పంచడానికి, సేవలు చేయడానికేనని ఆయన అన్నారు .
అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సయ్యద్ ఖలీద్,19 వార్డు టీడీపీ ఇన్చార్జ్ ప్రభాకర్ యాదవ్, రాయలసీమ విద్యార్థి ,యువజన సంఘాల జేఏసీ చైర్మన్ బి.శ్రీరాములు, సిస్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘసభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.