దేవుడు మనకు మార్గం సుగమం చేస్తాడన్న పోప్

ఆగస్టు నెలలో తన మొదటి బుధవారం సామాన్య ప్రేక్షకుల సమావేశంలో, పోప్ లియో యేసు శ్రమలు, మరణ పునరుత్థానంపై ధ్యానించమని కోరారు
ప్రతి ఒక్కరు తమను తాము సిద్దపరుచుకోవాలని పోప్ ఆహ్వానించారు.
సంసిద్ధత అనే పదం సరళంగా అనిపిస్తుంది కానీ క్రైస్తవ జీవితానికి అది ఒక విలువైన రహస్యాన్ని కలిగి ఉంది".
నిజమైన ప్రేమ "యాదృచ్ఛిక ఫలితం కాదని, ఆత్మవివేకముతో ఎంపిక చేసుకునేది" అని మార్కు సువార్తలో ప్రభువు తన శిషులతో కలిసి భుజించేందుకు చూపిన సిద్ధపాటు తెలియచేస్తుంది.
శిషుల కొరకు సిద్ధం చేయబడిన గది, దేవుడు మనకు మార్గం సుగమం చేస్తాడనే వాస్తవాన్ని వెల్లడిస్తుంది.
“మనం స్వాగతించబడాలని మనం గ్రహించే ముందు, ప్రభువు మనకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తారు అని గ్రహించుకోవాలి అని పోప్ అన్నారు
దయ మన స్వేచ్ఛను తొలగించదు కనుక దయ గలిగి జీవించడం మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ముఖ్యమైన పాఠంగా పరిగణించుకోవాలి అని పోప్ అన్నారు