Mpox తో బాధపడుతున్న వారికి ఫ్రాన్సిస్ పాపు గారు సంఘీభావం తెలిపారు

Mpox తో బాధపడుతున్న వారికి ఫ్రాన్సిస్ పాపు గారు  సంఘీభావం తెలిపారు

ఆదివారం నాటి ఏంజెలస్ వద్ద ప్రార్థన ముగింపులో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు  మాట్లాడుతూ  మంకీపాక్స్ వ్యాప్తికి గురైన వేలాది మంది ప్రజలకు తన సంఘీభావాన్ని అందించారు.

వ్యాధి సోకిన వారందరికీ, ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను" అని  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

"ఈ వ్యాధితో ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లోని స్థానిక ప్రజలకు, దేవాలయాలకు నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను" మరియు సహాయం అందిస్తున్న సహాయక బృందాలను ,  చికిత్సలను అందిస్తున్న ప్రభుత్వా మరియు ప్రైవేట్ సంస్థలను  ప్రోత్సహిస్తున్నాను, తద్వారా అందరికి తగిన వైద్యం అందుతుందని అన్నారు.

UN సంస్థ ఆగష్టు 22న గణాంకాల ప్రకారం, 2024లో 3,562 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.దీని ఫలితంగా 26 మంది మరణించారు. కాంగోలో వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer