"ఇది ప్రేమని పంచె సమయం" - బ్రదర్ సత్యం
"ఇది ప్రేమని పంచె సమయం" - బ్రదర్ సత్యం
ప్రభు యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పండుగ నెలలో మనమందరం ఉన్నాము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆనందం, ప్రేమ, శాంతి, దయను పంచుకుంటూ సంతోషంతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి అని "బ్రదర్ సత్యం " గారు "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" తో అన్నారు.
సామాజిక సేవలో ముందుండి, తన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటుతున్న "బ్రదర్ సత్యం " గారు ఈ శీతాకాలం లో విపరీతమైన చలికి ఇబ్బందిపడుతున్న చౌడవరంలోని 35మంది పేద పిల్లలను చేరదీసి, వారి నిత్య అవసరాలు తీరుస్తూ వారికీ రగ్గులు (దుప్పట్లు) ఉచితంగా ఇవ్వడం జరిగింది.
2019 నుండి ఖమ్మం మేత్రాసనం, పెనుబల్లి విచారణ పరిధిలోని చౌడవరం గ్రామంలో చెట్లకింద నివాసం ఉంటున్న కడు పేద పిల్లలను,పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, వారికీ ప్రభు యేసుని ప్రేమను తెలియజేస్తున్నారు బ్రదర్ సత్యం గారు.
నిస్వార్థమైన సేవ చేస్తున్న బ్రదర్ సత్యం గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుతూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.
Article By M Kranthi Swaroop