హోలీ స్పిరిట్ సిస్టర్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
హోలీ స్పిరిట్ సిస్టర్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
హోలీ స్పిరిట్ సిస్టర్స్ ఆధ్వర్యంలో విశాఖ అతిమేత్రాసనం లోని వెంగాపురం గ్రామం లో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. పేదలకు, అవసరంలో వున్నవారికి నాణ్యమైన వైద్యం అందేలాగున ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తునట్లు హోలీ స్పిరిట్ సిస్టర్స్ తెలియజేసారు.
దాదాపు 100 మందికి పైగా వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు. వైద్య పరీక్షలలో భాగంగా బిపి, షుగరు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ ప్రజలు అధికసంఖ్యలో ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
వెంగాపురం విచారణ కర్తలు గురుశ్రీ ఆనంద్ గారు హోలీ స్పిరిట్ సిస్టర్స్ మరియు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసారు.
Article by M kranthi Swaroop