పేదలతో కలసి విందు భుజించిన పొప్ లియో XIV
పేదలతో కలసి విందు భుజించిన పొప్ లియో XIV
ఆదివారం నాడు తొమ్మిదవ ప్రపంచ పేదల దినోత్సవాన్ని పురస్కరించుకుని, పరిశుద్ధ పోప్ లియో XIV గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1,300 మందితో కలసి భోజనం పంచుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఏంజెలస్ వద్ద ప్రార్థనల తర్వాత, పరిశుద్ధ పోప్ లియో XIV గారు అక్కడ వేచి వున్న వారితో భోజనం చేయడానికి వాటికన్‌లోని పాల్ VI హాల్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హాలును విశాలమైన భోజనాల గదిగా మార్చారు. ఈ సంవత్సరం డాటర్స్ ఆఫ్ ఛారిటీ స్థాపన 400వ వార్షికోత్సవాన్ని జరుపుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విన్సెంటియన్ మిషనరీల తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భయంగా "నా ప్రియమైన పోప్ ఫ్రాన్సిస్ గారు ఎంతో కోరుకున్న ఈ రోజున ఈ భోజనం కోసం ఈ మధ్యాహ్నం మనం ఎంతో ఆనందంతో సమావేశమయ్యాము" అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు.
ఆహారాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, పరిశుద్ధ పోప్ లియో XIV గారు తన ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ హింస, యుద్ధం మరియు ఆకలి కారణంగా బాధపడుతున్న వారి వైపు మళ్లించారు , వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలను జరిపారు.
భోజనం అందించినందుకు పరిశుద్ధ పోప్ లియో XIV గారు విన్సెన్టియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. "ఈ రోజు కోసం మేము నిజంగా కృతజ్ఞత మరియు కృతజ్ఞతా స్ఫూర్తితో నిండి ఉన్నాము" అని ఆయన అన్నారు .
Article by M Kranthi Swaroop