హోలీ స్పిరిట్ కాన్వెంట్ (VZM)వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

హోలీ  స్పిరిట్ కాన్వెంట్ (VZM)వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

హోలీ  స్పిరిట్ కాన్వెంట్ (VZM) వారి ఆధ్వర్యంలో  విజయనగరం లోని వి.టి.అగ్రహారం గ్రామం లో  ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. విజయనగరంలోని సమీపంలోని గ్రామాలలో ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు  సిస్టర్ రీటా గారు తెలిపారు. విన్సెంట్ డి పాల్ సొసైటీ వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని సిస్టర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  డాక్టర్ బాబురావు గారు , డాక్టర్ వినోద్ కుమార్ గారు మరియు 12 మంది పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.విజయనగరం విన్సెంట్ డి పాల్ సొసైటీ  అధ్యక్షులు శ్రీ మణిభూషన్ గారు, కుమార్ స్వామి గారు,  శ్రీమతి నిర్మల మేరీ, సిస్టర్  విమల, చిన్నారావు గారు, కె.టి.కురియాకోస్ గారు మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దాదాపు 200 మందికి పైగా  వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు.  వైద్య పరీక్షలలో భాగంగా బిపి, షుగరు, ఇతర  వైద్య పరీక్షలు నిర్వహించారు.

సిస్టర్ రీటా గారు మాట్లాడుతూ " పేదలకు నాణ్యమైన వైద్యం అందేలాగున ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు".

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer