కొనసాగుతున్న విశ్వాసయాత్ర: మొబైల్ మిషన్ బోధనా బృందం

కొనసాగుతున్న విశ్వాసయాత్ర: మొబైల్ మిషన్ బోధనా బృందం

ఆంధ్ర, తెలంగాణ  రెండు రాష్ట్రాలలో పూణే మేత్రసనం వారు "మొబైల్ మిషన్ కన్వెన్షన్ ను నిర్వహిస్తున్నారు. అందులోని భాగంగా రేపల్లె, బాపట్ల  మరియు  ఇతర ప్రాంతాలలో ప్రార్థన కూటములు నిర్వహిస్తున్నారు. సిరియన్ మలంకర క్యాథలిక్ మిషనరీ గురువులు మరియు సిస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  

మారుమూలప్రాంతాలలో ఉన్న విశ్వాసుల గృహాలను, అనారోగ్యం తో ఉన్నవారిని  సందర్శిస్తూ, వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఫాదర్ శామ్యూల్ గారు ,ఫాదర్  పల్లి సెభాస్టియన్ గారు, "సిస్టర్స్ ఆఫ్ ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్‌"(SIC) మరియు డాటర్స్ అఫ్ మేరీ (DM) సిస్టర్స్ పాల్గొన్నారు.  

ఫాదర్  పల్లి సెభాస్టియన్ గారు మాట్లాడుతూ  " ఆయన ప్రేమకు హద్దులు లేవు, అది అందరికీ సమానంగా ఉంటుంది.ఆయన మన పాపాలను క్షమించి, మనల్ని కరుణిస్తాడు.
ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, నిష్కపటమైనది.ఆయన ప్రేమ ఎప్పటికీ అంతం కానిది, ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. యేసుప్రభువు ప్రేమను అనుభవించాలంటే, ఆయనపై విశ్వాసం ఉంచి, ఆయన బోధనలను అనుసరించాలి అని తెలిపారు.  

 దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించే అవకాశం కల్పించిన  ప్రియమైన అబూన్ (పీఠాధిపతులకు) మరియు మొబైల్ మిషన్ బోధనా బృంద గురువులకు మరియు సిస్టర్స్‌కు  కృతజ్ఞతలు గురు శ్రీ పల్లి సెభాస్టియన్ గారు తెలియజేసారు. 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer