స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన భారతీయులందరు ఎంతో ఘనంగా జరుపుకునే మహోన్నత పండగల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఒకటి.1947లో ఇదే రోజున, సుదీర్ఘ పోరాటం తర్వాత మన దేశానికి బ్రిటీష్ వారి పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది.భారతదేశ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన రోజు మన దేశ చరిత్రలో ఎందరో త్యాగమూర్తులను గుర్తుచేస్తుంది.
మనం ప్రేమించే ఈ మన దేశం, ఈ భారతదేశం - చాలా పురాతనమైనది... మన దేశం "ఆశతో నిండి ఉంది, అవకాశాలతో సజీవంగా ఉంది" . భారతీయులుగా మనం ఏమి కోరుకుంటున్నాము ?? ఒక సాధారణ మనిషిగా మనకు కావాల్సింది ఏంటి ?
ఎందుకంటే దేశం మార్పు అంచున ఉంది. ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా అణచివేతకు గురువుతూ , బాధపడుతున్న ప్రజలు ఇప్పుడు నిశ్శబ్దంగా లేరు. వారు కనిపించాలని కోరుకుంటారు మరియు వారి గళం వినిపించాలనుకుంటున్నారు. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా "అంటరానివారిగా, కుల వివక్ష ఎదుర్కొని నిశ్శబ్దంగా మరియు అణచివేతకు గురైన దళితులు, తమ కోసం గౌరవప్రదమైన స్థలాన్ని, గుర్తింపును, నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కోరుకుంటున్నారు.
అలాగే ఆదివాసీలు తమ పవిత్ర కొండలు మరియు లోయలను బాక్సైట్ మరియు బొగ్గు కోసం తవ్వడానికి నిరాకరిస్తున్నారు. వారు వాటి కోసం పోరాడుతున్నారు.
పేద,అణగారిన వర్గాల వారిపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, హత్యలను భరించడానికి ఎవ్వరు సిద్ధముగా లేరు. డబ్బున్నవారిని , పలుకుబడి వున్నవారిని ఎదిరిస్తూ చిన్నవారు మరియు పెద్దలు, మహిళలు నేను సైతం అని నిలబడుతున్నారు వారి హక్కుల కొరకు ఇప్పటికి పోరాడుతున్నారు.
మన దేశంలో పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలు మరియు దాడులను నివారించమని, మనం దేశంలో శాంతి నెలకొనేలా మనదేశాన్ని దీవించామని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్దించుదాం.
అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer