ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

విశాఖ అతిమేత్రాసనం, రాజమండ్రి విచారణ , కొంతమూరు లోని జూబిలీ మెమోరియల్ RCM ఇంగ్లీష్ మీడియం హై  స్కూల్ (Jubilee Memorial (R.C.M) English Medium High School ) నందు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలు స్కూల్ హెఅడ్మిస్ట్రేస్(Headmistress)  సిస్టర్  జైసే మరియా FCC, గారి అధ్వర్యం లో జరిగాయి. 

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా "హోలీ  రెడీమేర్స్ దేవాలయ" విచారణ కర్తలు ఫాదర్ మనోజ్ కుమార్  గారు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య రావడానికి అమరులైన పలువురు స్వతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు.

ఫాదర్ మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ  " దేశం కోసం  ఎంతోమంది వీరులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసారని, త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకోవడం మన బాధ్యత అని, ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమి చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.  

పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

Article and Design: M. Kranthi Swaroop