జపమాల మాత పండుగ (7 అక్టోబరు)

పండుగ చరిత్ర

క్రీస్తు శకం 1571లో తురుష్కులు క్రైస్తవ దేశాలపై దండెత్తి వచ్చినప్పుడు యావన్మంది క్రైస్తవులు మరియతల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనకు ఫలితంగా క్రైస్తవుల చేతిలో తురుష్కులు ఓటమి పాలు చెందారు. ఈ విజయానికి గుర్తుగా మన తల్లి శ్రీసభ అప్పటి పోప్‌గార్ల ఆమోదంతో ఈ పండుగను కొనియాడుతూ వస్తున్నది. మొదట ఈ పండుగ కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చెందినది తరువాత శ్రీసభ దీనిని విశ్వవ్యాప్తం చెందినది.

జపమాల అంటే అర్థం జపముతో కూడిన మా అని అర్థం. ఇక్కడ జపము అంటే ప్రార్థన అని అర్థం. క్రీస్తు శకం 13వ శతాబ్ద ఆరంభంలో మరియతల్లి తన యొక్క స్వహస్తాల ద్వారా పునీత దోమినిక్‌ గారికి జపమాలను ఇచ్చి జపమాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు చెప్పి ఉన్నారు. జపమాల ప్రార్ధనలో మనం ధ్యానం చేసినట్లయితే జపమాలలో మొత్తం 20 గురుతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలు, ఐదు మహిమ దేవరహస్యాలు, ఐదు వెలుగు దేవరహస్యాలు ఉంటాయి.

క్రైస్తవుడుకి మొదట క్రీస్తు అంటే ఎవరు ఆయన మనకొరకు ఎందుకు వచ్చారు అనే విషయాలు తెలియకుండా ఆరాధనలో కూర్చుంటే దానికి విలువ ఉండదు. క్రైస్తవులకు క్రీస్తు బోధనలు, క్రీస్తు ప్రేమ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది తెలియకపోతే క్రైస్తవులుగా మన జీవితాలు వ్యర్థం. అందుకే మనకు శ్రీసభ మరియతల్లి ద్వారా జపమాల ప్రార్థనను ఇచ్చి ఉన్నది. ఈ దేవరహస్యాలు మొత్తంలో కూడా మనము క్రీస్తు ప్రభువు గురించి అధికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఆయన జననము, మరణము, మనకోసం అనుభవించిన శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద స్థాపన. అదేవిధంగా మరియమాతకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను మనము ఇందులో ధ్యానం చేయవచ్చు.

-Rev. Fr. Praveen Gopu

*It's purely Telugu content, Please turn off Translation

Designed By M Kranthi Swaroop