కోడూరుమాత మహోత్సవ నవ శనివారాంజలి  

కోడూరుమాత మహోత్సవ నవ శనివారాంజలి  

విశాఖ అతిమేత్రాసనంలో  ప్రసిద్ధి గాంచిన  "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి  అధిక సంఖ్యలో భక్తులు  కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది  కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.

కోడూరుమాత మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ  జులై నెల రెండవ శనివారం (13 జులై)  మొదలు వరుసగా రాబోయే తొమ్మిది శనివారాలు  "కోడూరుమాత మహోత్సవ నవ శనివారాంజలి"  అనే కార్యక్రమాన్ని పుణ్యక్షేత్రం చేపడుతోంది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక ప్రసంగీకులు, కోడూరుమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ యుగళ్ కుమార్ పసుపులేటి గారి ఆద్వర్యం లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ నవ శనివారాంజలి ప్రత్యేక కార్యక్రమాలలో ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి  అఖండ జపమాల , దివ్యసత్ప్రసాద ఆరాధన లో దివ్య కారుణ్య జపమాల, దేవుని వాక్య పరిచర్య  మరియు దివ్య బలిపూజ  నిర్వహిస్తున్నారని,  వచ్చిన భక్తులకు ప్రేమ విందును కూడా ఏర్పాటు చేసినట్లు గురుశ్రీ యుగళ్ కుమార్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమాలను  "Streams of Grace" యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయునునట్లు గురుశ్రీ యుగళ్ కుమార్ గారు తెలిపారు.


కోడూరుమాత మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మన ప్రియతమా గురువులు గురుశ్రీ  యుగళ్ కుమార్ గారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer