"విశ్వాసపాత్రులైన ప్రజల తల్లి" అనే పుస్తకాన్ని విడుదల చేసారు

"విశ్వాసపాత్రులైన ప్రజల తల్లి" అనే పుస్తకాన్ని విడుదల చేసారు 

కాన్ఫరెన్స్  అఫ్  కాథలిక్  బిషోప్స్  అఫ్  ఇండియా  (CCBI ) వారు "Mater Populi Fidelis" (విశ్వసనీయ ప్రజల తల్లి) అనే పుస్తకాన్ని  విడుదల చేసారు. డిసెంబర్ 1, 2025న మలేషియాలోని పెనాంగ్‌లో మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి గారు మొదటి కాపీనిnపెనాంగ్ అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య  కార్డినల్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్‌ గారికి  అందజేశారు.

మరియా మాతకి సంబంధించిన వేదాంతపరమైన బిరుదులను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇది  "విశ్వాసుల తల్లి" మరియు "ఆధ్యాత్మిక తల్లి" వంటి బిరుదులను ధృవీకరిస్తుంది. 
మరియు విశ్వాస ప్రయాణంలో మరియా మాత  పాత్రను ఇది నొక్కి చెబుతుంది.నేటి శ్రీసభ జీవితంలో మరియా మాత పట్ల భక్తిని పెంచుకోవడానికి ఇది సహాయక మార్గదర్శిగా పనిచేస్తుంది.

అయితే,  యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యేకమైన మధ్యవర్తిత్వం మరియు విమోచన పాత్రను కప్పివేయకుండా చూసుకోవడానికి "కో-రిడెంప్ట్రిక్స్' (Co-Redemptrix)"  అలానే  'మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్' (Mediatrix of All Graces) నే బిరుదులను వాడవద్దని  విశ్వాస సిద్ధాంతాలను రూపకల్పన చేసే డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ సూచనలు చేసింది.   
   

ఈ పుస్తకం కొరకు CCBI ను Email: [email protected] లేదా  Mob No: 9886730224. సంప్రదించగలరు 

By M kranthi Swaroop