విస్సన్నపేటలో వెల్లి విరిసిన మతసామరస్యం

విస్సన్నపేటలో వెల్లి విరిసిన మతసామరస్యం

విస్సన్నపేటలో గుడ్ ఫ్రైడే సందర్భంగా  ప్రభు యేసుని ప్రేమను, కరుణను లోకానికి చాటి చెప్పుతూ సిలువతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండలో శాంతి ర్యాలీ చేస్తున్న క్రైస్తవ సోదరులకు విస్సన్నపేట మసీదు వద్ద మసీదు కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచి నీరు  పంపిణీ చేశారు. సహాయం అందించిన ముస్లిం సోదరులకు క్రైస్తవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Source: Lokal App
Design By M. Kranthi Swaroop 
RVA Telugu Online Content Producer