ఆదిలాబాద్ మేత్రాసనం సువార్త విభాగం, బెల్లంపల్లి AMC గ్రౌండ్ లో జనవరి 19, 20, 21 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు జీవస్వరం 2024 ఆధ్యాత్మిక స్వస్థత కూటములను నిర్వహించింది.
19 జనవరి 2024 న సికింద్రాబాద్ లోని జ్యోతిర్మయి లో TCBC (తెలుగు పీఠాధిపతుల సమాఖ్య) ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కమిషన్ల డైరెక్టర్లు వారి వార్షిక నివేదికలను సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 2024-25 విద్యా సంవత్సరంలో మైనారిటీ విద్యార్థులకు పాఠశాలలు & కళాశాలల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని మేనేజింగ్ డైరెక్టర్ TS క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు తెలియచేసారు.
విజయవాడ మేత్రాసనం, ఉంగుటూరు మండలం, పెద అవుటపల్లి లో బ్రదర్ జోసఫ్ తంబి గారి 79వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ నుండి జరుగుతున్న నవదిన ప్రార్ధనలు 12 శుక్రవారం రాత్రితో ముగిసాయి.
కేరళ రాష్ట్రం, కొచ్చి, కక్కనాడ్ చర్చి ప్రధాన కార్యాలయంలో కొట్టాయం అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మాథ్యూ మూలకట్ గారు విలేకరుల సమావేశంలో జనవరి 10 సాయంత్రం 4:30 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు.
హైదరాబాద్ అగ్రపీఠం, పునీత యోహాను గురువిద్యాలయము నందు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపుల, గురువుల, దైవాంకితుల విభాగం వారు జనవరి 10 ,11 న గురువులకు రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నాయి.
ఇండోనేషియా, ఆటంబువా, ప్రాంతీయ జనరల్ హాస్పిటల్ (RSUD) నందు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య ఆంటోన్ పెయిన్ రాటు, SVD గారు జనవరి 6, 2024 శనివారం ఉదయం 10:11 గంటలకు మరణించారు.