విశాఖ అతిమేత్రాసనం, మక్కువ విచారణ, పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ పునః నిర్మాణ ప్రతిష్ఠోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ మరియాదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
గుంటూరు మేత్రాసనం సహకారంతో క్లారెట్ ధ్యాన బృందం వారు అక్టోబర్ 27 నుండి 29, 2024 వరకు భట్టిప్రోలులోని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమంలో మరియదళ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన మన విశ్వ కతోలిక తల్లి శ్రీసభ సకల పునీతుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది . శ్రీసభ యొక్క ముఖ్యమైన పవిత్ర దినం. ఈరోజు మన తల్లి శ్రీసభ పునీతుల యొక్క జీవితాలను మనకు ఆదర్శంగా చూపిస్తూ మన అందరిని కూడా వారి బాటలో నడవమని తెలియజేస్తూ ఉన్నది .