కర్నూలు మేత్రాసనము బనగానపల్లె విచారణలో ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు మేత్రాసనము బనగానపల్లె విచారణలో ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు మేత్రాసనము బనగానపల్లె విచారణలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈనెల 20వ తారీకు నుంచి 25వ తారీకు వరకు విచారణ స్థాయి అన్ని గ్రామాలలో మేత్రాసనపు యానిమీటర్స్ ఒక్కొక్క గ్రామంలో మూడు నాలుగు రోజులు ఉండి కుటుంబలను సందర్శించి ప్రార్ధనలు, చేయడం జరిగింది.
చివరి రోజు అయిన ఆదివారం రోజు అన్ని గ్రామాల ప్రజలతో బనగానపల్లె విచారణలో పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల జోసఫ్ గారు దివ్యబలి పూజా సమర్పించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు ఫాదర్ ప్రకాష్ గారు ఇతర గురువులు పాల్గొన్నారు.
అధికసంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాలు నుండి వచ్చినటువంటి ప్రజలకు సమిష్టి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది.విచారణ గురువు ఫాదర్ ప్రకాష్ గారు ఫాదర్ పసల జోసఫ్ గారికి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పార్థనలకు సహాయపడ్డ ఆనిమేటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Article and design by
M kranthi Swaroop