ప్రజలకు సహాయం చేయడానికి సంపదను ఉపయోగించండి - పోప్ లియో గారు

ప్రజలకు సహాయం చేయడానికి సంపదను ఉపయోగించండి - పోప్ లియో గారు
సెప్టెంబర్ 21న వాటికన్లోని సెయింట్ అన్నే విచారణ లో తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ "దేశాల నాయకులు "సంపదను మానవాళికి వ్యతిరేకంగా" ఉపయోగించడం కంటే, "సంపదను పేద అణగారిన వారి కొరకు ఉపయోగించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
ఆ సంపదతో "కార్మికులను అవమానించే వారిని లేదా వారి గుత్తాధిపత్యాలను నాశనం చేసే ఆయుధాలుగా మార్చడం" ద్వారా సాధారణ ప్రజలలో మంచిని ప్రోత్సహించడానికి ఉపయోగించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు ప్రార్థించారు.
"దేవుణ్ణి సేవించేవాడు సంపద నుండి విముక్తి పొందుతాడు; కానీ సంపదకు సేవ చేసేవాడు దాని బానిసగానే ఉంటాడు" అని ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
దేవుని డబ్బు విషయంలో నమ్మకంగా లేనివాడు మరి ఏ విషయంలో నమ్మకంగా ఉండలేడు అని, "న్యాయం కోరుకునేవాడు సంపదను మంచి పనులకు ఉపయోగిస్తాడు అని, మరియు "ఆధిపత్యాన్ని, మనుషుల మెప్పు కోరుకునేవాడు సాధారణ మంచిని వారిని స్వంత దురాశకు ఆహారంగా మారుస్తాడు" అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
ఆ రోజు సువార్త పఠనం లూకా 16:1-13 లో "నిజాయితీ లేని గృహనిర్వాహకుడి ఉపమానం గురించి యేసు ప్రభువు వారు చెప్పినది పరిశుద్ధ లియో XIV పాపు గారు గుర్తు చేసారు. ప్రభు యేసు చెప్పిన విధంగా "ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తాడు లేదా ఒకరి పట్ల అంకితభావంతో ఉంటాడు మరియు మరొకరిని తృణీకరిస్తాడు. మీరు దేవుడిని మరియు సిరిని సేవించలేరు అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
ఈ సందర్భముగా ఆయన శాంతి కోసం ప్రార్థన జాగరణలు నిర్వహిస్తున్న వారిని మరియు గాజాకు మానవతా సహాయం కోసం డబ్బును సేకరించే కతోలిక సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
Article and Designed By M Kranthi Swaroop