విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సోమవారం రాత్రి పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో 18 ఆగష్టు, ఆదివారం నాడు జాతీయ యువతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఆకాశమందు ఒక గొప్ప సూచకము ప్రదర్శితమాయెను. ఒక స్త్రీ సూర్యుని వస్త్రముగా ధరించి చంద్రుని తన పాదముల క్రిందను, శిరస్సునందు పండ్రెండు నక్షత్రముల కిరీటము కలిగియుండి ప్రత్యక్ష మాయెను" (దర్శన. 12:1).
జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.