అతిపెద్ద పవిత్ర జపమాల | Largest Holy Rosary

అతిపెద్ద పవిత్ర జపమాల | Largest Holy Rosary
సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బసిలికాలో శ్రీ జైంతన్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి తయారు చేసిన "అతి పొడవైన పవిత్ర రోసరీ"(జపమాల)ను కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ఆవిష్కరించారు. జూలై 5, 2025న బసిలికాలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో ఫాదర్స్ , సిస్టర్స్ మరియు భక్తులు హాజరయ్యారు.
"అతి పొడవైన పవిత్ర రోసరీ"(జపమాల)గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ సందర్భముగా మహా పూజ్య పూల అంతోని గారు సమక్షంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మెడల్ మరియు సర్టిఫికెట్ ను శ్రీ జైంతన్ ఫ్రాన్సిస్ గారికి అందించారు.
మహా పూజ్య పూల అంతోని గారు శ్రీ జైంతన్ ఫ్రాన్సిస్ గారిని మరియు వారి కుటుంబాన్ని అభినందించారు.
శ్రీ జైంతన్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ " 2.5 లక్షల బంగారు రంగులో ప్లాస్టిక్ పూసలతో (20,000 మీటర్ల పొడవు) తయారు చేయబడినది" అని, ఈ జపమాల విశ్వాసం మరియు భక్తికి ఒక స్మారక చిహ్నం గా నిలుస్తుంది అని అన్నారు. 5,6 జులై 2025(రెండు రోజులు) ప్రజల సందర్శనార్థం దీనిని సికింద్రాబాద్ లోని "సెయింట్ మేరీస్ బసిలికా"లో ఉంచనున్నారని అనంతరం చెన్నైలో వేలంకన్ని(వేలాంగణి) మాత దేవాలయ మ్యూజియం కి తరలించనున్నారు అని తెలిపారు. తనకు సహకారాన్ని అందించిన సెయింట్ మేరీస్ బసిలికా విచారణ కర్తలు ఫాదర్ ఆరోగ్యం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer