సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో "ఇన్వెస్టిట్యూర్ వేడుక - 2025"

సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో "ఇన్వెస్టిట్యూర్ వేడుక - 2025"
విజయవాడ మేత్రాసనం, మచిలీపట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు "ఇన్వెస్టిట్యూర్ వేడుక - 2025" జులై 2, 2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సిభి అంతోనీ గారు మరియు స్కూల్ కరెస్పాండంట్ ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విజయవాడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ ఎం. రాజారావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. లీడర్స్ గా ఎన్నుకోబడిన విద్యార్థిని, విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి ముఖ్యతిదినుండి బ్యాడ్జ్ లు , ఫ్లాగ్స్ (Flag) స్వీకరించారు. ఎన్నుకోబడిన స్కూల్ లీడర్స్ ను శ్రీ ఎం. రాజారావు గారు, మరియు స్కూల్ కరెస్పాండంట్ ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు అభినందించారు.
శ్రీ ఎం. రాజారావు గారు మాట్లాడుతూ దేవుని మాట, తల్లిదండ్రులు మాట మరియు ఉపాధ్యాయుల మాట వినాలని ప్రధాన సందేశంగా ప్రసంగించారు.
ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు మాట్లాడుతూ "విద్యార్థులు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వారి విద్యాపరమైన మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతో ముఖ్యం అని , విద్యార్థి నాయకులు అంకితభావం, నిబద్ధత కలిగి హృదయపూర్వకంగా సేవ చేయాలి అని , మంచి క్రమశిక్షణను కొనసాగించడంలో వారు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఫాదర్ బి వినయ్ గారు మరియు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. పిల్లలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Article and Design By
M kranthi swaroop