నూతన నియామకం
ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 27, 2024న కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా OCD సభకు చెందిన గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారిని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.
జ్వాన్నేసు గారు విజయవాడ మేత్రాసనం నవాబుపేటలో 1974 ఫిబ్రవరి 27న జన్మించారు.
1994-1997 కేరళ, ఆల్వేలోని సేక్రేడ్ హార్ట్ ఫిలసాఫికల్ కాలేజ్‌లో తత్వశాస్త్రాన్ని మరియు 1998-2001 రోమ్, పోంటిఫికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ టెరిసియానమ్ లో వేదాంతశాస్త్రాన్ని అభ్యసించారు
ఖమ్మం మేత్రాసనం, తల్లాడలో 10 జనవరి 2002లో నిష్పాదుక కార్మెల్ సభ OCD గురువుగా అభిషేకింపబడ్డారు
2002 ఖమ్మం, కల్లూరు సహాయక విచారణ గురువుగా తన సేవలు ప్రారంభించారు
2002-2006 రోమ్ పొంటిఫికల్ బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ నుండి పవిత్ర గ్రంథంలో తన లైసెన్షియేట్ పొందారు.
2006-2008 రోమ్, పోంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి వేదాంతశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.
నిష్పాదుక కార్మెల్ ఆంధ్రా ప్రాంతీయ ప్రొవిన్సియల్ గా, OCD ఇంటర్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా మరియు ఖమ్మం మేత్రాసన సలహాదారునిగా పనిచేసారు.
అదే సమయంలో (2008-2014) తను ఆంధ్రప్రదేశ్ కథోలిక పీఠాధిపతుల సామాఖ్య బైబిల్ కమిషన్ మరియు APBC సువార్త ప్రబోధ సేవా విభాగ సభ్యునిగా భాద్యతలు నిర్వహించారు.
2008-2015 కేరళ,కలమస్సేరిలోని జ్యోతిభవన్‌లో, 2010-2015 వరకు ఖమ్మం,సెయింట్ జోసెఫ్స్ మేజర్ సెమినరీలో పవిత్ర గ్రంథ భోధనాధ్యాపకులుగా పనిచేసారు.
2010-2014 ఆంధ్రప్రదేశ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ (APRCRI) అధ్యక్షులుగా మరియు APBC విద్య సేవా విభాగానికి ఉపాధ్యక్షులుగా భాద్యతలు నిర్వహించారు.
2014-2015 హైదరాబాద్ అగ్రపీఠం, నాచారం సెయింట్ పాయస్ X మొనాస్టరీ విచారణ కర్తలుగాను, సుపీరియర్ గా పనిచేసారు.
2015-2021 రోమ్,నిష్పాదుక కార్మెల్ సభ జనరల్ గా పనిచేసారు.
డిసెంబరు 2021 నుండి ఇప్పటి వరకు రోమ్,OCD ఇంటర్నేషనల్ కాలేజ్, సెమినారిమ్ మిషనుమ్ రెక్టర్‌గాను,
2022 నుండి ఇప్పటి వరకు రోమ్‌లోని మారియానమ్-విజిటింగ్ ప్రొఫెసర్ గా మరియు రోమ్‌లోని టెరెసియానమ్‌లో లెక్చరర్‌గా తన సేవలందిస్తున్నారు
గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారిని దేవుడు ఆశీర్వదించి, దీవించాలని మనసారా కోరుతోంది అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా తెలుగు విభాగం.