'ప్రార్ధనా స్థలాలను గౌరవించాలి' - ఫ్రాన్సిస్ జగద్గురువులు

Places of worship must be respected - pope

'ప్రార్ధనా స్థలాలను గౌరవించాలి' - ఫ్రాన్సిస్ జగద్గురువులు

కాథలిక్ చర్చిలో 15 మంది మరియు బుర్కినా ఫాసోలోని మసీదులో 12 మంది మరణించిన సంఘటన తర్వాత  ఫ్రాన్సిస్ జగద్గురువులు విచారణ వ్యక్తం చేస్తూ, చనిపోయినవారి కొరకు ప్రార్థిస్తూ, పవిత్రంగా చూసుకునే  ప్రార్థనా స్థలాలను గౌరవించాలని అన్నారు.

" యుద్ధం పరిష్కారం కాదని గుర్తుచేస్తూ, పవిత్ర స్థలాలను గౌరవించాలని మరియు శాంతి విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో హింసకు వ్యతిరేకంగా పోరాడాలని ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రజలను ఆహ్వానించారు అని పీఠాధిపతుల అధ్యక్షుడికి ఫిబ్రవరి 26న టెలిగ్రామ్ పంపబడింది. ఫ్రాన్సిస్ జగద్గురువులు తరపున రాసిన టెలిగ్రామ్‌పై వాటికన్ సెక్రటరీ ఆఫ్ కార్డినల్ మహా పూజ్య పియట్రో పరోలిన్ గారు సంతకం చేశారు.

 ఫిబ్రవరి. 25 ఉదయం  చిన్న గ్రామమైన ఎస్సాకేన్‌లోని ప్రార్థనా మందిరంలోకి జిహాదీలు చొరబడి అక్కడ ఉన్న పురుషులపై కాల్పులు జరపడం ప్రారంభించారని, అయితే మహిళలను వదిలేశారని , దాడి సమయంలో పన్నెండు మంది చనిపోయారు; చికిత్స పొందుతూ  గాయాలతో ముగ్గురు మరణించారు మరియు మరో ఇద్దరు గాయపడ్డారు అని  మహా పూజ్య  డబిరే గారు  తెలిపారు.

2018 నుండి చాలా మంది క్రైస్తవులు జిహాదీ గ్రూపుల హింస కారణంగా ఈ ప్రాంతం నుండి పారిపోవాల్సి వచ్చిందని మహా పూజ్య  డబిరే గారు చెప్పారు. ఫ్రాన్సిస్ జగద్గురువులు దాడి గురించి తెలుసుకుని "తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు" అని   టెలిగ్రామ్ పేర్కొంది. "నాటియాబోనిలోని మసీదుపై జరిగిన దాడికి ముస్లిం సమాజానికి కూడా ఫ్రాన్సిస్ జగద్గురువులు తన సంఘీభావాన్ని తెలియజేసారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer