పవిత్ర బైబిలు గ్రంథ ఆదివార వేడుకలు

మన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు పవిత్ర బైబిలు గ్రంథ ఆదివారాన్ని ప్రతి సంవత్సరం జనవరి రెండవ ఆదివారమున కొనియాడాలని నిర్ణయించింది. ఈ ఆదివారాన్ని అర్థవంతంగా కొనియాడాలని విశ్వాసులందరు "పవిత్ర బైబిలు గ్రంథముతో ప్రార్ధన చేయుట" అనే అంశంపై లోతుగా ధ్యానించి, దైవసంభాషణకు మన మానవ స్పందన ద్వారా ఆత్మీయ మేలులను పొందాలని పరిశుద్ధ గ్రంథ సేవా విభాగం అధ్యక్షులు మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు, ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ బి. కిరణ్ బాబు గారు ఆహ్వానించారు 
 

Tags