వేళాంగణి మాత దేవాలయంలో విభూది బుధవార దివ్యబలి పూజ

Lent archdiocese of visakhapatnam


వేళాంగణి మాత దేవాలయంలో భక్తియుతంగా విభూది బుధవార దివ్యబలి పూజ

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి  మాత దేవాలయం, కైలాసపురం లో  విభూది బుధవార సాంగ్యాలు భక్తియుతంగా జరిగాయి.  ఉదయం 7:00 గం॥లకు జపమాల అనంతరం విచారణ కర్తలు  గురుశ్రీ సంతోష్ CMF, మరియు సహాయక గురువులు గురుశ్రీ జాన్ CMF ఆధ్వర్యంలో దివ్యబలిపూజ భక్తియుతంగా జరిగింది.

విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్యబలి పూజ లో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.  దివ్యబలి పూజ లో  విశ్వాసుల నుదిటిపైన విభూదిని సిలువ ఆకారంలో గురువులు రాయడం జరిగింది.

దివ్యబలి పూజ అనంతరం 40  రోజులు దీక్ష తీసుకునే విశ్వాసులకు "దీక్ష స్వీకరణ కార్యక్రమం"    గురుశ్రీ సంతోష్ గారి చేతులమీదుగా జరిగింది.  సాయంత్రం 6:00 గం||లకు సిలువ మార్గం, తదుపరి దివ్యబలిపూజ జరగనున్నది.  

తపస్సుకాలములో సోమవారము నుండి గురువారము వరకు ఉదయం 7 గం||లకు దివ్యబలిపూజ, తరువాత పరిశుద్ద సిలువ మార్గం నిర్వహించనున్నారు.
 శుక్రవారం  సాయంకాలం 6 గం||లకు పరిశుద్ధ సిలువ మార్గం, అనంతరం  దివ్యబలిపూజ నిర్వహించనున్నారు.
శనివారం  సాయంకాలం 5.30 గం॥లకు పరిశుద్ద సిలువ మార్గం, తరువాత దివ్యబలిపూజ, వేళాంగణి మాత నవదిన ప్రార్ధనలు జరగనునవి.
 ఆదివారం  ఉదయం 7.30 గం|| లకు పరిశుద్ద సిలువ మార్గం తరువాత దివ్యబలిపూజ నిర్వహించునున్నట్లు గురుశ్రీ సంతోష్ గారు తెలిపారు.

గురుశ్రీ సంతోష్ గారు విశ్వాసులు  ఆధ్యాత్మికంగా ముందుకు నడిచేలా  వారి కొరకు ప్రత్యక   కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.  

మొదటిగా "దీక్షాపరులకు ప్రత్యేక ప్రార్థన కూటమి" 18-02-2024 ఆదివారం ఉ॥ 10 గం॥ల నుండి మ॥ 1 గం॥ వరకు నిర్వహించనున్నారు.

"పాప పశ్చాత్తాప పాద యాత్ర" మార్చ్ 3 శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి  మేరీమాత కొండ గుడి వరకు జరగనున్నది.
 
"తపస్సుకాల తీర్ధ యాత్ర " మార్చి 7 గురువారం రాత్రి 9 గం॥లకు బయలుదేరి గుణదల మాత పుణ్య క్షేత్రం (విజయవాడ), ధన్య తంబీవారి పుణ్య క్షేత్రం (అవుటపల్లి), హోలీ ల్యాండ్ (ఏలూరు), గోదావరి మాత పుణ్య క్షేత్రంలను సందర్శించనున్నారు.

 తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్ధనా కూడికను 17-03-2024 ఆదివారం నాడు ఉ॥ 9:00 గం॥ల నుండి సా॥ 4:00గం|| వరకు గురుశ్రీ  మరియదాస్, డైరెక్టర్, డివైన్ మెర్సీ రిట్రీట్ సెంటర్ కంటకాపల్లి గారిచే నిర్వహించనున్నారు.

కైలాసపురం విచారణలో జరుగు ఈ తపస్సు కాలపు పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడికలో విశ్వాసులందరు  తప్పకుండ పాల్గొని మంచి పాపసంకీర్తనం చేసి ఈస్టర్ పండుగను కొనియాడాలని గురుశ్రీ సంతోష్ గారు విశ్వాసులను కోరారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer