మహా పూజ్య పొలిమేర జయరావు గారికి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు


మహా పూజ్య పొలిమేర జయరావు గారికి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు

ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు గారికి  33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు.  

ఈరోజు అనగా 31 మార్చి 2025న ఏలూరులోని కార్మెల్ భవన్‌లో మహా పూజ్య పొలిమేర జయరావు గారి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహా పూజ్య పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు , సిస్టర్స్ పాల్గొని మహా పూజ్య పొలిమేర జయరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భముగా ఏలూరు మేత్రాసన  ప్రొక్యూరేటర్ గురుశ్రీ  బి. రాజు గారు మాట్లాడుతూ  మహా పూజ్య పొలిమేర జయరావు గారు  తన 33 సంవత్సరాల అర్చక పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకోవడం దేవుని వరం అని అన్నారు.  ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ  బాలా గారు కృతజ్ఞతలు తెలిపారు.

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer