ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ఏలూరు మేత్రాసనం, ఏలూరు  సోషల్ సర్వీస్ సెంటర్ (SSC) వారి ఆధ్వర్యంలో ఆగష్టు 29,శుక్రవారం నాడు మెగా జాబ్ మేళాను నిర్వహించారు. 

ఏలూరు మేత్రాసన పీఠాధిపతి మరియు సోషల్ సర్వీస్ సెంటర్ ఛైర్మన్  మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటుచేశారు. ఎస్‌ఎస్‌సి డైరెక్టర్, చాన్సలర్  రెవ. ఫాదర్ టి. ఇమ్మానుయేలు గారి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 జైస్వాల్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, విజయరాయ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముంబై అగ్రపీఠాధిపతులు, కార్డినల్ మహా ఘాన ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారు మరియు ఏలూరు మేత్రాసన పీఠాధిపతి మరియు సోషల్ సర్వీస్ సెంటర్ ఛైర్మన్ మహా పూజ్య డా. జయరావు పొలిమేర గార్లు పాల్గొన్నారు. 
 
కార్డినల్ మహా ఘాన ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారు రిబ్బన్ కటింగ్ ద్వారా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెగా జాబ్ మేళా లో పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.ముంబై హైకోర్టు న్యాయవాది శ్రీ జోకిమ్ ఎఫ్. రైస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏలూరు మేత్రాసనం చేపడుతున్న సేవలను అభినందించారు.

ఈ సందర్భముగా మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు మాట్లాడుతూ "మేత్రాసనంలో అనేకమంది యువతీ యువకులు ఉన్నత విద్య పూర్తి చేసినప్పటికీ, ఉద్యోగాలు దొరకక కష్టాలను ఎదురుకొంటున్నారని, ఉద్యోగాన్వేషణలో నిరాశ చెందకుండా, అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని , నిరుద్యోగుల కొరకు ఈ  మెగా జాబ్ మేళాను ఏర్పాటుచేశారని తెలిపారు.   యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ పి. బాల గారు , సోషల్ సర్వీస్ సెంటర్ వైస్ ఛైర్మన్ ఫాదర్ బి. రాజు,ఫాదర్  స్టీవెన్, ఫాదర్ మరియాజొజి, ఫాదర్ సుందర్, ఫాదర్ ఆనంద్,  తదితర గురువులు హాజరయ్యారు. 


Article and design by M Kranthi Swaroop