మధ్యప్రాచ్యంలోని కతోలికులకు నిరీక్షణ సందేశాన్ని పంపిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న హింస మరియు బాధల మధ్య ఉన్న కతోలికులకు సమైక్యత మరియు నిరీక్షణా సందేశాన్ని అందించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
అక్టోబర్ 7, 2024 నాటికి ఈ సంఘర్షణ తీవ్రతరం అయి ఒక సంవత్సరం కావస్తుంది.
నిరంతర రక్తపాతం మరియు విధ్వంసంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
"నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మరియు మీ కోసం ప్రార్థిస్తున్నాను." పాపు ఫ్రాన్సిస్ గారు వారి మద్దతును లేక ద్వారా తెలియచేసారు
మధ్యప్రాచ్యంలో శాంతిని తీసుకురావడంలో అంతర్జాతీయ సంస్థలు విఫలమైందని, యుద్ధం యొక్క నిరర్థకత్వము మరియు అది అమాయకులపై పడిందని దుయ్యబట్టారు.
ఫ్రాన్సిస్ గారు " ద్వేషం మరియు హింస వల్ల కలిగే లోతైన గాయాలు అయినప్పటికీ విశ్వాసులు వారి స్థితిస్థాపకతకు మెచ్చుకున్నారు"
ఎన్నో కష్టాలు ఉన్నా మీ దేశంలో ఉండిపోవాలని కోరుకుంటున్నందుకు ధన్యవాదాలు, తోటివారిని ప్రేమిస్తూ, అందరి కొరకు ప్రార్దిస్తునందుకు ధన్యవాదాలు" అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు
మధ్యప్రాచ్యంలోని క్రైస్తవులు తరచుగా ఒంటరిగా మరియు బలహీన పడిపోతున్నారని భావించిన పాపు గారు "మీరు ఒంటరిగా లేరు" అని సందేశం ఇచ్చారు
ముఖ్యంగా గాజా లోని శరణార్థులు, తమ బిడ్డల కొరకు దుఃఖిస్తున్న తల్లులు, యుద్ధ భయాందోళనలకు గురవుతున్న వారందరినీ ఉద్దేశించి "నేను మీకు దగ్గరగా ఉన్నాను, నేను మీతో ఉన్నాను" అని ఫ్రాన్సిస్ గారు రాశారు.
ఆయన మాటలు కష్టాల్లో ఉన్న ప్రజల విశ్వాసం నిరాశ సమయంలో కూడా నిరీక్షణకు దారితీసాయి
పాపు ఫ్రాన్సిస్ గారి లేక అంత "ప్రార్థన మరియు ఉపవాసం యొక్క శక్తిని" గురుతుచేస్తూ
ప్రార్థన మరియు ఉపవాసం చరిత్రను మార్చే ప్రేమ ఆయుధాలు' అని అయన అన్నారు
విశ్వాసంతో అహింసాత్మక పరిష్కారాలకు అనుకూలంగా హింస చక్రాన్ని తిరస్కరిస్తూ శాంతి కోసం దేవుణ్ణి ఆశ్రయించాలని ఆయన క్రైస్తవులను ప్రోత్సహించారు.
సమాధాన రాజ్ఞి అయిన మరియ మాత మరియు కతోలికుల పోషకుడి పునీత జోజప్ప గారి రక్షణను కోరుతూ పాపు ఫ్రాన్సిస్ గారు తన ఆశీర్వాదాలతో ముగించ్చారు