భక్తిశ్రద్ధలతో పిల్లల సదస్సు

భక్తిశ్రద్ధలతో పిల్లల సదస్సు

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం లో రెండు రోజుల చిన్న పిల్లల సదస్సు భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  

శని, ఆదివారాలలో జరిగినటువంటి ఈ సదస్సు  జపమాలతో ప్రారంభమైన ,ఆధ్యాత్మిక బోధనలు, దేవుని పాటలతో స్తుతించుట, ఆటలా పోటీలు నిర్వహించారు.   అధిక సంఖ్యలో చిన్నారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. విచారణ సిస్టర్స్ ,యువతీ యువకులు తమ సహాయ సహకారాలను అందించారు.

రెండవరోజు మొదటి సారి దివ్య సత్ప్రసాదం స్వీకరించబోతున్న పిల్లలతో పాటు,  త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్స్వమును  సందర్భముగా  కుటుంబ సమేతముగా అధిక సంఖ్యలో విశ్వాసులు దేవాలయమునకు వచ్చి పండుగ దివ్య బలిపూజలో పాల్గొన్నారు.  

విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ గారు ప్రజలందరికి  త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ , పిల్లల సదస్సు కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Producer