పేదలకు ఆహారాన్ని పంచిపెట్టిన వాటికన్

టోర్ వెర్గాటాలో జరిగిన యువతా జూబ్లీ తర్వాత డికాస్టరీ ఫర్ ఎవాంజెలైజేషన్ నేతృత్వంలో  ఉపయోగించని ఆహారాన్ని పేదలకు పంచిపెట్టారు.

రోమ్‌లోని మేత్రాసన కారితాస్ సభ్యులు ఆహార పంపిణీ చేశారు.

వీటిని సూప్ కిచెన్‌లు, క్రైస్తవ మత సంస్థలు మరియు పేదసాదలకు సేవ చేసే ఇతర సంస్థలకు పంపిణీ చేసినట్లు తెలిపారు 

వాటికన్ ఈ రకమైన సంజ్ఞ చేయడం ఇదే మొదటిసరేమీ కాదు. ఉదాహరణకు,పోప్ ఫ్రాన్సిస్ చాలా సందర్భాలలో పేదవారికి సహాయం చేస్తూ కనిపించారు.

ఈ సంజ్ఞ ద్వారా పోప్ లియో తన పూర్వీకుల అడుగుజాడలను అనుసరించడం ప్రారంభించారు అని మనకు తెలుస్తుంది