నూతన దివ్యసత్ప్రసాదం స్వీకరించిన చిన్నారులు


నూతన దివ్యసత్ప్రసాదం స్వీకరించిన చిన్నారులు

కర్నూలు మేత్రాసనం, సాంబగల్లు గ్రామము, పునీత చిన్న తేరేసమ్మ గారి దేవాలయములో  నూతన దివ్యసత్ప్రసాద స్వీకరణ కార్యక్రమము ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమము విచారణ కర్తలు గురుశ్రీ  మేకల రాజేష్ గారి ఆద్వర్యం లో జరిగాయి.  

కర్నూల్ పీఠాధిపతులు మహా పూజ్య గోరంట్ల జ్వానేస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య బలిపూజను సమర్పించారు. ఈ దివ్య బలిపూజలో 90  మంది చిన్నారులు నూతన  దివ్యసత్ప్రసాదాని స్వీకరించారు.

 అధికసంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విచారణ ప్రజలు  నూతన పీఠాధిపతులకు ఘాన స్వాగతం పలికారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

 విచారణ కర్తలు గురుశ్రీ  మేకల రాజేష్ గారు వచ్చిన భక్తులందరికీ ప్రేమ విందుని  ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు గురుశ్రీ  మేకల రాజేష్ గారు.  

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer