ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న బ్రదర్ సత్యం

ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న బ్రదర్ సత్యం
ప్రభు యేసుని ప్రేమను చాటుతూ కడు పేద పిల్లలకు ఆహరం మరియు బట్టలు, నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేస్తున్నారు బ్రదర్ సత్యం.
ఖమ్మం మేత్రాసనం, పెనుబల్లి విచారణ పరిధిలోని చౌడవరం గ్రామంలో చెట్లకింద నివాసం ఉంటున్న కడు పేద పిల్లలను,పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని ప్రభు యేసుని ప్రేమను వారికీ తెలియజేస్తున్నారు బ్రదర్ సత్యం గారు.
2019 నుండి ఈ కార్యక్రమాన్ని చేప్పట్టి వారికీ సహాయపడుతున్నారు.ప్రస్తుతం 35 మంది పిల్లలకు సహాయం అందిస్తున్నారు. వారంలో 3 రోజులపాటు వారికీ దగ్గర ఉండి ఆహారాన్ని అందిస్తున్నారు. అలానే వారికీ కావాల్సిన స్కూల్ బాగ్స్ ,బట్టలు ,చెప్పులు ఇతర నిత్యావసరాలను వారికీ అందిస్తున్నారు.
నిస్వార్థమైన సేవ చేస్తున్న బ్రదర్ సత్యం గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుతూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.
Article by mk swaroop