తెలుగు రాష్ట్రాల జాతీయ యువత కోఆర్డినేటర్ గా ప్రశాంత్ కుమార్

 

తెలుగు రాష్ట్రాల జాతీయ యువత కోఆర్డినేటర్ గా ప్రశాంత్ కుమార్ 

2025 నుండి 2028 వరకు మూడు సంవత్సరాల కాలానికి నూతన నేషనల్ YU4C (NYU4C) సర్వీస్ ఆఫ్ కమ్యూనియన్ బృందాన్ని నియమించారు. CNSC తరపున సిస్టర్ స్వప్న జాన్ MSA, సిస్టర్ పౌలినా మెలైట్ MSMI, చెవ్. సిరిల్ జాన్, మిస్టర్ అజిన్ జోసెఫ్ మరియు విక్టర్  జోయన్స్ ల  మార్గదర్శకత్వంలో ఈ బృందాన్ని ఎంపిక చేశారు. 

ఈ బృందంలో  విజయవాడ మేత్రాసనానికి చెందిన "మెరుగు ప్రశాంత్ కుమార్" ని ఆంధ్ర మరియు తెలంగాణ  రాష్ట్రాల జాతీయ యువత కోఆర్డినేటర్ గా నియమించారు. విజయవాడ  మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య జోసెఫ్ రాజా రావు గారు ప్రశాంత్ ను అభినందించారు. 

 అంతర్జాతీయ స్థాయిలో, పరిశుద్ధ  పోప్ ఫ్రాన్సిస్ గారు  "CHARIS" (Catholic Charismatic Renewal International Services) అనే ఒకే అంతర్జాతీయ సేవా సంస్థను స్థాపించారు. భారతదేశంలో, CHARIS నేషనల్ సర్వీస్ ఆఫ్ కమ్యూనియన్ (CNSC) మార్గదర్శకత్వంలో యూత్ యునైటెడ్ ఫర్ క్రైస్ట్ (YU4C)  పనిచేస్తుంది.

 

Article and Design By

M kranthi Swaroop