మణిపూర్‌లో 257 మంది నిరాశ్రయులు స్వస్థలాలకు తిరిగి వచ్చారు
మణిపూర్‌లో 257 మంది నిరాశ్రయులు స్వస్థలాలకు తిరిగి వచ్చారు
కలహాలతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలలో 250 మందికి పైగా ప్రజలు జాతి హింసతో నిరాశ్రయులయ్యారు. వారిలో ఎక్కువ మంది స్వదేశీ క్రైస్తవులు. వీరు స్వంత ఇల్లు ,ప్రాంతాలు వదిలేసి ఇప్పటికీ సహాయ శిబిరాల్లో మగ్గుతున్నారు.
డిసెంబర్ 4,2025న సహాయక శిబిరాలలో లో నివసిస్తున్న 257 మంది బిష్ణుపూర్ జిల్లాలోని లీమారం వరోయిచింగ్ గ్రామంలోని 64 మెయిటీ కుటుంబాలకు చెందిన ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జిల్లాలోని అత్యున్నత పౌర అధికారి, డిప్యూటీ కమిషనర్ పూజా ఎలాంగ్‌బామ్ గారు లీమారం హైస్కూల్ సహాయ శిబిరంలో ఉన్న వారికి వీడ్కోలు పలికేందుకు హాజరయ్యారు.దీనిని శాంతి వైపు అడుగుగా ఆమె అభివర్ణించారు.
మణిపూర్‌లోని 3.2 మిలియన్ల జనాభా మే 3, 2023న మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈశాన్య రాష్ట్రంలో దారుణమైన హింస చెలరేగింది. మెజారిటీ హిందూ మెయిటీ సమాజానికి గిరిజన హోదా మంజూరు చేయడంపై, ప్రధానంగా క్రైస్తవ స్థానిక ప్రజలు దీనికి అభ్యంతరం తెలిపారు.
ఈ అంతర్యుద్ధం కారణంగా 260మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు మరియు 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 11,000 కంటే ఎక్కువ ఇళ్లు, దాదాపు 360 దేవాలయాలు మరియు పాఠశాలలతో సహా అనేక ఇతర క్రైస్తవ సంస్థలు ధ్వంసమయ్యాయి.
Article By M Kranthi swaroop