ఘనంగా మొదలైన జీసస్ యూత్ వారి "వేడుక"

ఘనంగా మొదలైన జీసస్ యూత్ వారి "వేడుక"
తెలుగు ప్రాంతీయ "జీసస్ యూత్" 30 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు సెప్టెంబర్ 13,14 తేదీలలో జరగనున్నవి. తెలుగు ప్రాంతీయ జీసస్ యూత్ సభ్యులు "వేడుక" అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు కార్యక్రమంలో హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా ఘన కార్డినల్ పూల అంతోనీ గారు , శ్రీకాకుళం పీఠాధిపతులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు మరియు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు పాల్గొన్నారు.
వైజాగ్ జీసస్ యూత్ సభ్యుడు ఆకుల వంశీ బృందం ఏర్పాటు చేసిన ప్రో-లైఫ్ (Pro-Life) ప్రదర్శనను మహా ఘన కార్డినల్ పూల అంతోనీ గారు మరియు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు ప్రారంబించారు. ప్రో-లైఫ్ (Pro-Life) పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫోటోలు, వీడియోలు, పోస్టర్లు తో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఇది గర్భస్రావాన్ని వ్యతిరేకించే ఒక ఉద్యమం. ఇది గర్భంలోని పిండం యొక్క జీవితాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
అనంతరం పీఠాధిపతులందరు ఇతర గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు. మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని యువతకు అందించారు. జీసస్ యూత్ వారు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా , ప్రతి విచారణలో అడుగుపెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో జీసస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జీసస్ యూత్ సభ్యులు మధురమైన గీతాలను ఆలపించారు. సాయంతం ఆరాధన మరియు ప్రత్యేకమైన కార్యక్రమములు జరగనున్నావి.
Article and desig by M kranthi swaroop