అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు
అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు
CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు ఉక్రెయిన్, గాజా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ముగించాలని పిలుపునిచ్చారు.
ఫ్రాన్సీస్ జగద్గురువులు గారు మాట్లాడుతూ "యుద్ధంలో ఉన్న దేశాలను ఉద్దేశిస్తూ దయచేసి యుద్ధాన్ని ఆపండి, శాంతి కోసం చూడండి. అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం అని అన్నారు."
కాసా శాంటా మార్టాలో బుధవారం మధ్యాహ్నం US రేడియో-టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడారు.అయన మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ కోసం "నేను చాలా ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. వివాదాలను ఆపడానికి మరియు శాంతి చర్చల మార్గాన్ని ఎంచుకోవడానికి యుద్ధంలో ఉన్న అన్ని దేశాలను ఈ సందర్భముగా ఫ్రాన్సీస్ జగద్గురువులు ఆహ్వానించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల పిల్లలకు ఎదురయ్యే పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు పోప్ ఫ్రాన్సిస్ ఇలా సమాధానమిచ్చారు: "ప్రస్తుతం ఆ పిల్లలు నవ్వడం మర్చిపోయారు. ఒక పిల్లవాడు నవ్వడం మరచిపోయినప్పుడు ఇది చాలా కష్టం. భయం గుప్పిట్లలో వారు ఉన్నారు , నిరంతరంవారికొరకు ప్రార్థిస్తున్నా అని అన్నారు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికీ స్థలం ఉందని అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer