విభూది బుధవారం

AshWednesday.
AshWednesday.

విభూది బుధవారం

విభూది  బుధవారాన్ని బాధ, దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారు. దేవుని భక్తులు నుదిటిపైన భస్మం ఉంచుకోవడం వలన ఈ పద్ధతికి పేరు పొందుపరచబడింది. సాధారణంగా మునుపటి సంవత్సరపు మట్టల ఆదివారంలో ఉపయోగించిన  మట్టాలను(లేదా కొబ్బరి ఆకులు) కాల్చి  ఈ బూడిద సేకరిస్తారు.

క్రైస్తవ మతంలో విభూది బుధవారం  శ్రమ దినాల (లెంట్) కు మెదటి రోజుగా అనగా ఈస్టర్ ముందు 40 రోజుల క్రీస్తు అనుభవించిన శ్రమలకు గుర్తుగా ఈ లెంట్ ఆచరిస్తారు, (ఆదివారాలు లెక్కింపు చేర్చబడిన లేదు, ఆదివారాలు కలిపితే 46 రోజులు వస్తాయి ).
అనేక మంది  క్రైస్తవులు ఈ 40  రోజులు  ఉపవాసం, పశ్చాత్తాపం, మాంసాహారం భుజిపకపోవడం , ఆధ్యాత్మిక క్రమశిక్షణ తో అధిక సమయం దేవాలయం లో గడపటం ,యేసు ప్రభువుని సిలువ శ్రమలను  గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం సిలువమార్గం లో పాల్గొనడం చేస్తుంటారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer