తెలుగు ప్రాంతీయ యువ నాయకుల శిక్షణ కోసం పోస్టర్ ఆవిష్కరణ

తెలుగు ప్రాంతీయ యువ నాయకుల శిక్షణ కోసం పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ యువజన ఆదివారం సందర్భంగా, హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు తెలుగు ప్రాంతీయ నాయకుల శిక్షణా కార్యక్రమ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ (ICYM) తెలుగు రీజియన్ సహకారంతో TCBC కమిషన్ ఫర్ యూత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాంతీయ మరియు మేత్రాసన యువ నాయకులను బైబిల్ పై అవగాహనా , ఆధ్యాత్మికత, అవసరమైన నైపుణ్యాలు, విలువలు మరియు మరియు దేవుని సేవలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రీజినల్ యూత్ డైరెక్టర్ ఫాదర్ స్లీవా రాజు గారు, రీజినల్ యూత్ ప్రెసిడెంట్ రాజు , రీజినల్ యూత్ సెక్రటరీ మనీషా, NEXCo సభ్యుడు కళ్యాణ్, మరియు NEXCo మాజీ సభ్యురాలు రెజీనా మరియు ఇతర యువ ప్రతినిధులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27–28, 2025 తేదీలలో హైదరాబాద్‌లో ఈ ప్రాంతీయ నాయకుల శిక్షణా కార్యక్రమం జరగనున్నది.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer