మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

విజయవాడ మేత్రాసనం, మచిలీపట్టణం, పవిత్ర సిలువ దేవాలయం (Holy Cross Church)లోమ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ కడు ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో జరిగింది.

అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. ప్రతిఒక్కరు మ్రాని కొమ్మలను పట్టుకొని గురువులతో కలసి పాదయాత్రగా దేవాలయం చేరుకున్నారు. యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము’ అనే సంఘటనను ధ్యానిస్తూ ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు దివ్య బలిపూజను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలను చేసారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ కిషోర్ గారు పాల్గొని ప్రార్థనలు చేసారు.

ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు మ్రాని కొమ్మల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు. యేసు ప్రభువారి వాలే తగ్గించుకుకొనే గుణం, అయన ప్రేమను, జాలిని, కరుణను కలిగి జీవించాలని విశ్వాసులు కోరారు.

Article and Design By M. Kranthi Swaroop