శ్రమదినాలు మారుమనస్సు మరియు స్వేచ్ఛను పొందే సమయం - ఫ్రాన్సీస్ జగద్గురువులు

lent2024 Pope francis

శ్రమదినాలు  మారుమనస్సు  మరియు స్వేచ్ఛను పొందే  సమయం -  ఫ్రాన్సీస్ జగద్గురువులు

పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు  "శ్రమదినాలు 2024" కోసం ఇచ్చిన  సందేశంలో విశ్వాసులను "ప్రార్థన కోసం" మన పనులనుండి  స్వల్ప విశ్రాంతి తీసుకోమని మరియు  మన చుట్టూ అవసరంలో ఉన్న మన సోదరులు మరియు సోదరీమణులకు సహాయం చేయాలని తద్వారా సమాజాలను మరియు మన జీవితాలను ఆదర్శంగా తయారు అవుతాయన్నారు.  

"మన దేవుడు తనను తాను బహిర్గతం చేసినప్పుడు, అతని సందేశం ఎల్లప్పుడూ స్వేచ్ఛకు సంబంధించినది" అని ఫ్రాన్సీస్ జగద్గురువులు తన సందేశాన్ని ప్రారంభిస్తూ చెప్పారు .

ఈజిప్టు నుండి వచ్చిన హీబ్రూ ప్రజలను  గుర్తు చేసుకుంటూ, వారిని శ్రమలనుండి విముక్తి చేసి ఎడారి గుండా ప్రయాణం చేసిన కాలాన్ని దేవుని దయ యొక్క సమయం అని అన్నారు. బాధలతో కష్టాలలో ఉన్న మన సోదరులు మరియు సోదరీమణులకు మనంకూడా సహాయం చేయాలని అన్నారు. "ఉదాసీనత యొక్క ప్రపంచీకరణ"ను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఫ్రాన్సీస్ జగద్గురువులు నొక్కిచెప్పారు.

శ్రమదినాలు అనేది "దయ యొక్క కాలం అని , మారుమనస్సు పొందే  సమయం" అని అన్నారు.  మరల ఎడారి "బానిసత్వంలోకి తిరిగి రాకూడదనే వ్యక్తిగత నిర్ణయం మనం  స్వేచ్ఛగా తీసుకోవాలని అన్నారు.  లెంటెన్ ప్రయాణం పోరాటంతో కూడుకున్నదని ఆయన అన్నారు. ఇది చర్యకు సమయం అని పోప్ చెప్పారు. "దేవుని ప్రేమ అందరి పట్ల ఒకే విధంగా ఉంటుందన్నారు.