శాంతిని లక్ష్యంగా కాకుండా ఒక మార్గంగా ఎంచుకోండి" - పోప్ లియో XIV

"శాంతిని లక్ష్యంగా కాకుండా ఒక మార్గంగా ఎంచుకోండి" - పోప్ లియో XIV

 పరిశుద్ధ పోప్ లియో XIV గారు తన తన 6 రోజుల అపోస్తోలిక  ప్రయాణాన్ని (టర్కీ మరియు లెబనాన్‌) ముగించారు. మధ్యప్రాచ్యం అంతటా సంభాషణ, సోదరభావం మరియు సయోధ్య కోసం పిలుపునిచ్చారు. 

మంగళవారం బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారిక “వీడ్కోలు వేడుక” జరిగింది. బీరుట్ విమానాశ్రయంలో రోమ్‌కు బయలుదేరే ముందు, పరిశుద్ధ లియో పాపు XIV గారు సోదరభావం మరియు శాంతి యొక్క ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పారు.

ఈ సందర్భముగా లెబనాన్ చరిత్ర శాంతియుత భవిష్యత్తు వైపు ప్రయాణానికి జీవనోపాధిని అందిస్తుందని పేర్కొంటూ, సెయింట్ చార్బెల్ సమాధిని సందర్శించిన విషయాన్ని పరిశుద్ధ పోప్ లియో XIV గారు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

"ట్రిపోలి మరియు ఉత్తరం, బెకా మరియు దేశంలోని దక్షిణం, ఇది ప్రస్తుతం సంఘర్షణ మరియు అనిశ్చితిని ఎదుర్కొంటోంది అని గుర్తు చేస్తూ "శత్రుత్వాలకు ముగింపు పలకాలని పరిశుద్ధ లియో పాపు XIV గారు పిలుపునిచ్చారు.  “సాయుధ పోరాటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మనం గుర్తించాలి. ఆయుధాలు ప్రాణాంతకం అయితే, చర్చలు, మధ్యవర్తిత్వం మరియు సంభాషణలు నిర్మాణాత్మకమైనవి. మనమందరం శాంతిని లక్ష్యంగా కాకుండా ఒక మార్గంగా ఎంచుకుందాం! అని పరిశుద్ధ లియో పాపు XIV గారు అన్నారు.

*It's purely Telugu content, Please turn off Translation

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer