కొలంబియా అధ్యక్షుడుతో సమావేశమైన 14వ సింహరాయలు పోప్ గారు

కొలంబియా అధ్యక్షుడుతో సమావేశమైన 14వ సింహరాయలు పోప్ గారు
పోప్ లియో XIV గారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో జరిగిందని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ సోమవారం ప్రకటించింది.
ఈ సందర్భముగా ప్రేక్షకుల సమక్షంలో పోప్ లియో XIV మరియు కొలంబియా అధ్యక్షుడు పెట్రో గార్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ సమావేశం తరవాత కొలంబియా అధ్యక్షుడు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి అయిన అగ్రపీఠాధిపతులు పాల్ రిచర్డ్ గల్లాఘర్ గారితో సమావేశమయ్యారు.
ఈ "స్నేహపూర్వక చర్చల" సందర్భంగా, వారు కొలంబియాలోని సామాజిక-రాజకీయ పరిస్థితిని గురించి చర్చించారు, "భద్రత, వలసలు మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్లపై" ప్రత్యేక దృష్టి సారించారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది.
Article and Design By
M kranthi Swaroop